ఇంట్రెస్టింగ్..”పుష్ప 1″ లో బిగ్గెస్ట్ హైలైట్ గా ఈ అంశాలు..?

Published on Dec 15, 2021 5:39 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో రిలీజ్ కి అత్యంత చేరువలో ఉన్న చిత్రం “పుష్ప”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన మోస్ట్ ప్రిస్టేజియస్ సినిమా ఇది.

పాన్ ఇండియన్ వైడ్ మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం అనుకున్న అంచనాలు అందుకుంటుందా అనే ప్రశ్నకు కొన్ని రిపోర్ట్స్ పాజిటివ్ సంకేతాలు చెబుతున్నాయి.

పుష్ప లో కొన్ని కీలక అంశాలు బిగ్గెస్ట్ హైలైట్ గా నిలపనున్నట్టు తెలుస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే కానీ ప్లాట్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమాలో కనిపిస్తాయట. అలాగే ఇంటర్వెల్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ బ్యాంగ్ లు నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ని అందిస్తాయని ఆసక్తికర టాక్ ఒకటి వినిపిస్తుంది. మరి వీటికి తగ్గట్టే సినిమా ఉంటుందా లేదా? అనేవి తెలియాలి అంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :