“పుష్ప 2” లో ఈ అంశాలు మరింత హైలైట్ గా ఉంటాయట.!

Published on Jan 23, 2022 4:20 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప ది రైజ్”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రంలో మొదటి దానిని గత డిసెంబర్ లో రిలీజ్ చేసి వారి కెరీర్ లో భారీ హిట్ ని వారు అందుకున్నారు.

ఇక ఈ మొదటి పార్ట్ సాలిడ్ హిట్ అవ్వడంతో మళ్ళీ టోటల్ పాన్ ఇండియన్ వైడ్ పార్ట్ 2 పై అంచనాలు విపరీతంగా నెలకొన్నాయి. అందుకే సుకుమార్ పార్ట్ 2 మరింత జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అందులో భాగంగానే ఈ పార్ట్ పై పలు ఆసక్తికర విషయాలే వినిపిస్తున్నాయి.

మొదటి పార్ట్ లో కంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు మరింత స్టన్నింగ్ గా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. అలానే ఇంకో పక్క ఎమోషన్స్ ని కూడా మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తాయట అంతే కాకుండా వీటికి మరింత స్కోప్ పార్ట్ లో ఉంటుందని తెలుస్తుంది.

అలాగే మరో కొత్త విలన్ కూడా వచ్చే భాగంలో యాడ్ అవుతాడని తెలుస్తుంది. ఇలా వీటన్నిటితో పుష్ప రాజ్ పాత్ర మరింత స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యి ఈ సినిమాలో అంతటిలో హైలైట్ అవుతాయని టాక్.

సంబంధిత సమాచారం :