ఈ సంక్రాంతి కి బరిలో ఆ నాలుగు బడా సినిమాలు!

Published on Jul 27, 2021 11:36 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ లతో పాటుగా, పలు చిత్రాల విడుదల లు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా సినిమాల షూటింగ్ లు మళ్ళీ పునః ప్రారంభం అవ్వడం తో పాటుగా, పలు చిత్రాలు విడుదల తేదీలను ఖరారు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.

అయితే ఈ నేపథ్యం లో పరశురాం దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 3 చిత్రం సైతం ఈ సంక్రాంతి కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలు గా నటిస్తున్నారు. అయితే థలపతీ విజయ్ బీస్ట్ చిత్రం సైతం సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా లు కలిసి నటిస్తున్న చిత్రం కూడా సంక్రాంతి కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అధికారిక ప్రకటన సైతం వెలువడింది.

అయితే ఈ చిత్రాలు అన్ని సంక్రాంతి బరిలో ఉండగా, మరికొన్ని చిత్రాలు కూడా సంక్రాంతి రేస్ కి సిద్దం అవుతున్నాయి. అయితే బడా సినిమాలు కూడా సంక్రాంతి కి షిఫ్ట్ కావడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :