“కల్కి” లో నాగ్ అశ్విన్ ఫేవరెట్ క్యామియోస్ వారివేనట

“కల్కి” లో నాగ్ అశ్విన్ ఫేవరెట్ క్యామియోస్ వారివేనట

Published on Jul 10, 2024 6:30 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సహా మరింత మంది బిగ్ స్టార్స్ అమితాబ్, కమల్ (Kamal Haasan), దీపికా పడుకోణ్ ఇంకా దిశా పటాని లాంటి స్టార్స్ నటించారు. మరి ఈ భారీ సినిమాలో కాన్సెప్ట్ సహా ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉండగా నాగ్ అశ్విన్ అయితే సినిమాలో మరింత మంది స్టార్స్ ని స్పెషల్ క్యామియోస్ లో చూపించడం వైరల్ అయ్యాయి.

మరి మెయిన్ లీడ్ కాకుండా క్యామియోస్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దుల్కర్ సల్మాన్ ఇంకా మృణాల్ ఠాకూర్ సహా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) అలాగే సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కనిపించారు. మరి ఈ అందరిలో కూడా ఓ ఇద్దరి క్యామియోస్ బాగా ఇష్టమని నాగశ్విన్ వెల్లడించాడు. తనకి ఇష్టమైన క్యామియోస్ ఎవరివో కాదు దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మవే అట. వారిద్దరి క్యామియోస్ సినిమాలో బాగా ఎంజాయ్ చేసానని తెలిపాడు. మరి క్యామియోస్ నిజంగానే సినిమాలో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు