777 చార్లీ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న ఈ ప్రముఖ నటీనటులు

Published on May 15, 2022 7:03 pm IST

భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మలయాళ చిత్రం 777 చార్లీకి తెలుగు లో సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు రానా దగ్గుపాటి. 777 చార్లీ తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనున్న సురేష్ ప్రొడక్షన్స్, రేపు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది.

అయితే దీన్ని మరింత ప్రత్యేకంగా రూపొందించడానికి, ట్రైలర్‌ను స్టార్ నటులు విక్టరీ వెంకటేష్, సాయి పల్లవి మరియు లక్ష్మి మంచు రేపు మధ్యాహ్నం 12:12 గంటలకు డిజిటల్‌గా విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో, సంగీతా శృంగేరి, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా మరియు ఇతరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో జూన్ 10, 2022న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :