హాట్ టాపిక్ గా “RRR” మాసివ్ ట్రైలర్ లో మార్పులు..!

Published on Feb 5, 2022 1:00 pm IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సహా టోటల్ పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ఎన్నో రిలీస్ డేట్ లను పరిస్థితిలు బాలేక మార్చుకోవాల్సి వచ్చింది.

మరి ఎట్టకేలకు అయితే మేకర్స్ రీసెంట్ గా ఒక ఫైనల్ డేట్ మార్చ్ 25న ఫిక్స్ చేశారు. అయితే ఇదిలా ఉండగా దీనికి ముందు ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ సినిమా తాలూకా మాసివ్ ట్రైలర్ తో చూపించిన సంగతి తెలిసిందే. ఆ భారీ విజువల్ ట్రీట్ ట్రైలర్ ని ఇప్పటికీ రిపీట్స్ చాలా మంది చూస్తుంటారు. మరి అలా చూసినవారికి “RRR” యూనిట్ ఒక స్వీట్ ట్విస్ట్ నే ఇచ్చారు అని చెప్పాలి.

ఇప్పుడు కానీ ఈ ట్రైలర్ ని యూట్యూబ్ లో ప్లే చేసి చూస్తే రెండు చోట్ల జనవరి 7 డేట్ ప్లేస్ లో ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త డేట్ మార్చ్ 25 కనిపిస్తుంది. దీనితో ఇదెపుడు అప్డేట్ చేసారా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా ఈ ఇంట్రెస్టింగ్ సైలెంట్ మార్పు హాట్ టాపిక్ గా అయ్యిపోయింది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :