బిగ్ బాస్ 5: ఈ వారం నామినేట్ అయ్యేది వీరేనా?

Published on Sep 13, 2021 4:00 pm IST


బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో, ఈ ఏడాది భారీ టీఆర్పీ లను నమోదు చేస్తుంది. గతేడాది లాగా కాకుండా, ఈ ఏడాది అందరూ కుటుంబ సభ్యులు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సరయు బిగ్ బాస్ హౌజ్ లో నుండి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వారం మరొకసారి కుటుంబ సభ్యులు నామినేట్ అయ్యే అవకాశం ఉంది.

బిగ్ బాస్ షో ను చూస్తే ఈ సారి కుటుంబ సభ్యుల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కుటుంబ సభ్యులు రెండు గ్రూపు లుగా విడిపోయి, నామినేషన్లు వేయడం జరిగింది. ఇంట్లో ప్రతి ఒక్కరూ సీరియస్ తో చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోబో మరియు రవి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ తాజాగా విడుదల అయిన ప్రోమో లో మనం చూడవచ్చు. అదే విధంగా శ్వేత వర్మ ఎంతో కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపించడం జరిగింది. అయితే ఈ వారం హమీద, ఉమా, కాజల్, రవి, లోబో లు నామినేట్ కానున్నారు. ఈరోజు ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే షో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :