తెలుగు ఓటిటి ఆహా లో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతోన్న హాలీవుడ్ సినిమాలు

Published on May 18, 2022 6:02 pm IST

ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్, ఆహా, మరో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఇంగ్లీష్ సినిమాలను చూడటానికి ఇష్టపడే సబ్‌స్క్రైబర్‌ లకు శుభవార్త చెప్పింది. ఆహా 30 కి పైగా తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ సినిమాలను తన లైబ్రరీకి జోడించేందుకు సిద్దం అవుతోంది.

5 ఆసక్తికరమైన ఆంగ్ల చిత్రాలు మెన్ ఇన్ బ్లాక్ 3, ది అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్, రెసిడెంట్ ఈవిల్, మరియు ఢంగో అన్ చైన్డ్ మే 20, 2022న ఆహాలో విడుదల కానున్నాయి. ఇవి కాకుండా రానున్న రోజుల్లో మరిన్ని డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం ఈ స్పేస్‌ను చూస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం :