“ఆదిపురుష్”లో కీలక మార్పులు.?

“ఆదిపురుష్”లో కీలక మార్పులు.?

Published on Nov 17, 2022 8:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్” కోసం తెలిసిందే. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస చిత్రం కాగా మేకర్స్ అయితే భారీ విజువల్ ట్రీట్ లా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే నెక్స్ట్ అనుకున్న రేంజ్ రెస్పాన్స్ ఈ చిత్రం టీజర్ తో అందుకోలేకపోయింది.

దీనితో మళ్ళీ సినిమాని బెటర్ చేస్తున్నట్టుగా వాయిదా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ వర్క్ లో గ్రాఫిక్స్ మరియు పలు పాత్రలకి సంబంధించి పలు కీలక మార్పులు చేస్తున్నారట. వానర సైన్యంతో పాటుగా నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన పాత్ర అయినటువంటి రావణ పాత్రలో కూడా మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమేర నిజముందో అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు