పుష్ప టీజర్ లో ఈ అంశాలు కీలకం!

Published on Nov 2, 2021 1:03 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. పుష్ప ది రైస్ మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం వుంది. అయితే ఈ టీజర్ లో ప్రధానం గా కొన్ని అంశాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే విడుదల అయిన కొన్ని విడియోలు మరియు పాటలలో అల్లు అర్జున్ గెటప్ మరియు స్మగ్లింగ్ నేపథ్యం తరహా సన్నివేశాలు చూడటం జరిగింది. ఇక విడుదల కాబోయే టీజర్ లో విలన్ పాత్ర తో పాటుగా సునీల్ పాత్ర కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో సునీల్ నెగటివ్ షేడ్స్ లో కనిపించనున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More