ప్రముఖ బ్యానర్స్ లో వైష్ణవ్ తేజ్ సాలిడ్ ప్రాజెక్ట్.!

Published on Jan 13, 2022 11:00 am IST

తన మొదటి సినిమా తోనే ఏ ఇండియన్ హీరో కూడా సొంత చేసుకోలేని భారీ హిట్ ని మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరి తర్వాత “కొండ పొలం” అనే క్విక్ ప్రాజెక్ట్ చేసి పరవాలేదనిపించాడు.

కానీ ఇక ఇక్కడ నుంచి మాత్రం వైష్ణవ్ లైనప్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఈరోజు తన బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ అయినటువంటి ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారి కలయికలో ఈ కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు.

మరి ఈ సినిమా మాత్రం సాలిడ్ గా ఉండేలా అనిపిస్తుంది. ఈ అనౌన్సమెంట్ వీడియో కూడా చాలా ఆసక్తికరంగా ఉండడమే కాకుండా మేకర్స్ ఇది ఒక మాస్ ప్రాజెక్ట్ అన్నట్టు కూడా టీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :