“బిగ్ బాస్ 5” ఫైనల్స్ కి గెస్టులుగా వీరు.. కానీ.?

Published on Dec 19, 2021 7:04 am IST

మన తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీసన్ 5 ఫైనల్ ఎపిసోడ్ రానే వచ్చేసింది. ఈరోజు ఎంతో ఘనంగా ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఈరోజు స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ కానుంది. అయితే ఇంకా కొన్ని అంశాలు అయితే సస్పెన్స్ గానే ఉన్నాయి. ఫినాలే లో విజేతగా ఎవరు గెలుస్తారు? ఎవరు ఈ ఫైనల్స్ కి గెస్ట్ గా వచ్చారు అనేది.

అయితే ఇక్కడ టాక్ నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” యూనిట్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇది కన్ఫర్మ్ కాగా వీరు షో మధ్యలో ముచ్చటించడానికి వచ్చారా లేక విన్నింగ్ కంటెస్టంట్ ని అనౌన్స్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉండగా RRR యూనిట్ కూడా వస్తారని గాసిప్స్ ఉన్నాయి కానీ దీనిపై అయితే ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి మాత్రం ఈ గ్రాండ్ ఎపిసోడ్ ని చూడటానికి చాలా మందే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :