రీ రిలీజ్ కి సిద్ధం అవుతోన్న గ్యాంగ్ లీడర్, బద్రి చిత్రాలు!


టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు రీ రిలీజ్ చేస్తుండటం తో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పుడు మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు మరో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రెడీ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ గ్యాంగ్ లీడర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ బద్రి థియేటర్లలో రీ రిలీజ్ కి సిద్ధం అవుతోన్న పెద్ద తెలుగు సినిమాలు అని సోషల్ మీడియాలో గాసిప్ హల్ చల్ చేస్తోంది.

ఈ వార్త నిజమైతే, వచ్చే నెలలో ఈ సినిమాల రీమాస్టర్డ్ వెర్షన్‌లు విడుదల కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా ఇప్పటికే విడుదలైంది. అలాగే ఇంద్ర నిర్మాతలు కూడా సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తమ్ముడు, జల్సా సినిమాలు కూడా కొన్ని నెలల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Exit mobile version