శంకర్, చరణ్ ల ప్రాజెక్ట్ లాంచ్ కి ఈ ముగ్గురు దిగ్గజాలు!

Published on Sep 8, 2021 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ఈరోజు లాంచ్ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా కూడా జస్ట్ హైప్ మాత్రం వేరే లెవెల్లోకి వచ్చింది. అయితే మరి నిజంగానే ఫిక్స్ అయ్యిన ఈ భారీ ప్రాజెక్ట్ లాంచ్ కి స్పెషల్ గెస్టులుగా బాలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు రణ్వీర్ సింగ్ హాజరు కానున్నాడని మొదటగా తెలిసింది.

మరి నిన్నటికి లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా కన్ఫర్మ్ అయ్యారని తెలిసింది. కానీ ఇపుడు అసలు పోస్టర్ దర్శనం ఇచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్ లాంచ్ కి రణ్వీర్, మెగాస్టార్ తో పాటుగా మరో టాప్ ఇండియన్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా రావడం కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ ముగ్గురు వస్తున్నట్టుగా వారికి ఆహ్వానం చెబుతున్న ఫ్లెక్స్ నే ఇప్పుడు బయటకి వచ్చింది. సో దీనితో ఈ భారీ చిత్రం ఆరంభానికే శంకర్ ముగ్గురు దిగ్గజాలను పట్టుకొచ్చేసారు. ఇక ముందు నుంచి ఈ చిత్రానికి ఎంతటి గ్రాండియర్ ని శంకర్ జోడిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :