టాలీవుడ్ నుండి రిలీజ్ కావాల్సిన భారీ చిత్రాలు వాయిదా పడటం తో సమ్మర్ బాక్సాఫీస్ సందడి తగ్గిపోయింది. ఈ ఏడాది సమ్మర్ సెలవులను క్యాష్ చేసుకోవడం లో టాలీవుడ్ చిత్రాలు విఫలం అయ్యాయి అని చెప్పాలి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన హను మాన్ (Hanuman) మరియు గుంటూరు కారం (Gunturu kaaram) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ రెండు చిత్రాలు వంద కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు సాధించాయి.
హనుమాన్ లాంగ్ రన్ లో దాదాపు 350 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగా, గుంటూరు కారం 170 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సమ్మర్ కి ముందుగా థియేటర్ల లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ 130 కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ మూడు చిత్రాలు మాత్రమే తెలుగు లో ఈ ఏడాది వంద కోట్ల క్లబ్ లో చేరాయి.