ట్విట్టర్ లో లెజెండ్స్ గా టాలీవుడ్ నుంచి ఈ స్టార్ హీరోల పేర్లు.!

Published on Feb 23, 2022 2:00 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియాన్ సినిమా దగ్గర మన టాలీవుడ్ కి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఆల్రెడీ పాగా వేసి తన స్టార్డం ని ప్రూవ్ చేసుకొని భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఈ ఇద్దరి హీరోలకి కూడా మ్యూచువల్ ఫ్యాన్స్ అధికంగానే ఉంటారు. ఇంకా వీరితో పాటుగా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి మరికొంతమంది స్టార్ హీరోలు పవన్, మహేష్ బాబు, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కూడా ఉన్నారు.

మరి ఇప్పుడు ఈ అందరి హీరోల పేర్లు కూడా సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ లో ట్విట్టర్ కూడా ఒకటని తెలిసిందే. దాదాపు ప్రపంచంలో సగానికి పైగా మంది ఈ ట్విట్టర్ లో కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ట్విట్టర్ వారి నుంచి గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అని ఒక కొత్త ఎమోజి తో ఆటోమేటిక్ గా కొంతమంది పేర్లతో కనిపిస్తున్నాయి.

మరి ఈ లిస్ట్ లో అయితే మన టాలీవుడ్ నుంచి ఈ కొందరి స్టార్ హీరోస్ పేర్లు మాత్రం లెజెండ్స్ గా కనిపిస్తున్నాయి. దీనితో ఈ అందరి హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ తన భారీ సినిమా రాధే శ్యామ్ రిలీజ్ తో రెడీగా ఉండగా అల్లు అర్జున్ పుష్ప 2 షూట్ ని స్టార్ట్ చెయ్యనున్నాడు. అలాగే పవన్ భీమ్లా నాయక్ రిలీజ్ కి రెడీగా ఉంది, మహేష్ సర్కారు వారి పాట షూట్ లో బిజీగా ఉండగా ఎన్టీఆర్ చరణ్ ల భారీ సినిమా “RRR” కూడా రిలీజ్ కి రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :