“సీతా రామం” కి ఈ ఇద్దరు హీరోలు ఫస్ట్ ఛాయిస్?

Published on Aug 17, 2022 12:01 pm IST

సీతా రామం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి దుల్కర్ సల్మాన్‌ను తెలుగు చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా నిలిపింది. అతని పాత్ర అందరికి నచ్చింది. అయితే దుల్కర్‌ను ఫైనల్ చేసే ముందు ఈ సినిమా కోసం మేకర్స్, వైజయంతీ మూవీస్ స్టార్ హీరోలు నాని మరియు రామ్ పోతినేనిని సంప్రదించినట్లు చాలా మందికి తెలియదు.

కానీ పాపం, హీరోలు ఇద్దరూ తెలియని కారణాలతో సినిమాను తిరస్కరించారు. ఎటువంటి ఎంపిక లేకుండా నిర్మాతలు దుల్కర్‌ను సంప్రదించారు. తరువాత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది మరియు ఖచ్చితంగా, హీరోలిద్దరూ కూడా మంచి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని కోల్పోయారు. సీతా రామం చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :