వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలు!

Published on Aug 1, 2022 12:04 am IST


కరోనా వైరస్ కారణం గా దాదాపు రెండేళ్ల సమయం తర్వాత విడుదలైన ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలు కేజీఎఫ్2, ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రాలు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. కేజీఎఫ్ 2 చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. పార్ట్ 1 దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకోవడం తో పార్ట్ 2 కి మరింత క్రేజ్ లభించింది. దీంతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ చిత్రం త్వరలో జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మరో బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే డిజిటల్ ప్రీమియర్ గా పలు ఓటిటి ప్లాట్ ఫామ్ లకు వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. రోజురోజుకీ ఆర్ ఆర్ ఆర్ రేంజ్ పెరుగుతూనే ఉంది. ఈ చిత్రం త్వరలో స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాలు బుల్లితెర పై భారీ టీఆర్పీ ను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :