‘బిగ్ బాస్ 5’ ఎలిమినేషన్..ఆ ఇద్దరిలో ఒకరు అవుట్.?

Published on Sep 12, 2021 9:00 am IST


మన తెలుగు స్మాల్ స్క్రీన్ మోస్ట్ అవైటెడ్ గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ గత వారం కంప్లీట్ అయ్యి ఈరోజు వారం పూర్తి కావస్తుంది. మరి ఎన్నో అంచనాలతో స్టార్ట్ అయ్యిన ఈ గ్రాండ్ షో ఈరోజుతో దీని ఫస్ట్ ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే మరి ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ లిస్ట్ లో పలువురు కంటెస్టెంట్స్ ఉన్నారు. మొత్తం ఆరుగురు ఈ లిస్ట్ లో ఉండగా నిన్న ఎపిసోడ్ లో నాగ్ రవి మరియు హమిదా లను సేఫ్ జోన్ లో పెట్టేసారు.

మరి ఇంకా నలుగురు జెస్సి, ఆర్ జె కాజల్, మానస్ మరియు సరయులు ఉండగా వీరిలో ఇంకో ఇద్దరు అతి తక్కువ వోటింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఆ ఇద్దరు ఆర్ జె కాజల్ మరియు సరయూ. మరి వీరిద్దరిలో ఒకరు ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అవ్వడం ఖాయం అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరిపై బిగ్ బాస్ ఆడియెన్స్ లో చాలా నెగిటివిటీ వచ్చేసింది. సో వీరిలో ఒకరు అవుట్ అని టాక్. మరి ఎవరు వైదొలిగారో తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :