“బిగ్ బాస్ 5” లో టాప్ క్రేజ్ తో కంటిన్యూ అవుతున్న ఈ ఇద్దరు!

Published on Oct 24, 2021 5:18 pm IST

ప్రపంచంలోనే అతి పెద్ద టెలివిజన్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా భారీ హిట్ అని తెలిసిందే. నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ గ్రాండ్ షో ఇప్పుడు ఐదవ సీజన్ తో కంటిన్యూ అవుతుంది. అయితే కొంతమంది కంటెస్టెంట్స్ తో మొదలయ్యే ఈ ప్రయాణంలో కొంతమందికి మాత్రం స్పెషల్ క్రేజ్ ఏర్పడుతూ వస్తుంది.

అలా ఈసారి సీజన్లో కూడా కొంతమంది ఉన్నారు. అయితే మంచి క్రేజ్ తో టాప్ లో ఓ ఇద్దరు కొనసాగుతున్నారని తెలుస్తుంది.. వారే షణ్ముఖ్ జస్వంత్ మరియు శ్రీరామ చంద్ర. గత కొన్నాళ్ల నుంచి ఈ ఇద్దరికీ మంచి పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. హౌస్ లో గేమింగ్ ని పక్కన పెడితే ఫాలోయింగ్ పాపులారిటీ పరంగా అయితే ఈ ఇద్దరూ టాప్ లో ఉన్నారట.

అలాగే ఒర్మాక్స్ వారు కూడా ఇదే చెబుతున్నారు. అలాగే ఇంకో పక్క గేమింగ్ పరంగా కూడా వీరిద్దరూ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని కూడా నెటిజన్స్ లో టాక్ ఉంది. కానీ ఈ క్రేజ్ లు వీళ్ళని హౌస్ లో ఎంతవరకు తీసుకువస్తాయో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :