చైతూ థ్రిల్లర్ సిరీస్ లో ఈ ఇద్దరు ఫీమేల్ లీడ్స్.!

Published on Mar 9, 2022 6:38 pm IST


అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఫైనెస్ట్ యాక్టర్ గా పేరున్న హీరో నాగ చైతన్య కూడా ఒకడు. ఇప్పుడు వరుస హిట్స్ తో ఆకట్టుకుని మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ వెళ్తున్న చైతు తన లైనప్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఓటిటి షోస్ కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అక్కినేని వారికి ఆస్థాన దర్శకుడిలా మారిన టాలెంటెడ్ ఫీల్మ్ మేకర్ విక్రమ్ కే కుమార్ తో ప్రస్తుతం “థ్యాంక్ యూ” అనే సినిమా చెయ్యడంతో పాటు ఓ ఆసక్తికర థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసాడు అదే “దూత”. హారర్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

మరి ఇప్పుడు ఈ సిరీస్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సిరీస్ లో మళయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియా భవాని శంకర్ మరియు పార్వతి లు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అంతే కాకుండా వీరంతా కలిసి ఉన్న స్నాప్ ఒకటి బయటకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి స్ట్రీమింగ్ కి వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :