వచ్చే నెలలో రంగస్థలం, మెర్సల్ చిత్రాలు హిందీ లో విడుదల!

వచ్చే నెలలో రంగస్థలం, మెర్సల్ చిత్రాలు హిందీ లో విడుదల!

Published on Jan 25, 2022 8:32 PM IST

సౌత్ లో సూపర్ హిట్ సాధించిన చిత్రాలు నార్త్ లో విడుదల కి సిద్ధం అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం ఇప్పుడు హిందీ లోకి విడుదల కి సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో కరోనా పరిస్థితుల కి అనుగుణంగా చిత్రం ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అదే విధంగా తలపతీ విజయ్ సెన్సేషన్ చిత్రం అయిన మెర్సల్ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. అట్లి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో సమంత, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించడం జరిగింది. బాహుబలి సీరిస్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో సాహో మరియు కేజీఎఫ్ చిత్రాలు హిందీ లో సెన్సేషన్ సృష్టించాయి. ఇప్పుడు పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ తో సౌత్ చిత్రాలు నార్త్ పై దాడి చేశాయి. అల వైకుంఠపురములో హిందీ లో విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వలన విడుదల నిలిచింది. ఈ సౌత్ చిత్రాలు హిందీ లో ఏ స్థాయిలో విజయం సాధిస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు