RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధులుగా ఈ ఇద్దరు హీరోలు?

Published on Mar 16, 2022 10:00 pm IST


టాలీవుడ్ స్టార్ హీరోలు, Jr NTR మరియు రామ్ చరణ్ లు హీరోలుగా, SS రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం RRR. బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25, 2022న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 19, 2022 న కర్ణాటకలోని చిక్క బళ్లాపూర్‌ లో గ్రాండ్‌గా జరగనుంది.

ఇప్పుడు తాజా గాసిప్ ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుండి రావాల్సి ఉంది. ఈ యాక్షన్ డ్రామాలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :