ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ వేడుక కి ఆ ఇద్దరు టాప్ హీరోలు!

Published on Dec 22, 2021 7:08 am IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం ప్రమోషన్స్ వేగవంతం అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ ఇప్పటికే బాలీవుడ్ లో ప్రీ రిలీజ్ వేడుక ను గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. టాలీవుడ్ లో కూడా ఈ వేడుక ను అంతకు మించి నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుక కి టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ హీరోలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి లు ఈ వేడుక కి హాజరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజమౌళి ఇలాంటి వేడుకలకు స్పెషల్ ప్లాన్ వేస్తారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. మరి దీని పై ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం లో వీరు సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :