“పెళ్లి సందD” కోసం ఇద్దరు వెరీ స్పెషల్ చీఫ్ గెస్టులు..!

Published on Oct 9, 2021 3:00 pm IST


సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా స్టార్ట్ చేసిన స్పెషల్ ప్రాజెక్ట్ “పెళ్లి సందD”. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శ్రీకాంత్ తో తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం పెళ్లి సందడి కి కొనసాగింపు అన్నట్టుగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణ లో దర్శకుడు గౌరీ రోనంకి తెరకెక్కించారు.

మంచి అంచనాలే నెలకొల్పుకున్న ఈ చిత్రం వచ్చే దసరా కానుకగా రిలీజ్ కాబోతుండగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాకి గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కి గాను దర్శకేంద్రునితో ఎన్నో అదిరే సూపర్ హిట్లు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి అలాగే విక్టరీ వెంకటేష్ లు వెరీ స్పెషల్ గెస్టులు గా హాజరు కాబోతుండడం ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ సినిమాలో రాఘవేంద్రరావు గారు కూడా నటించడం ఒక ఆసక్తికరమైన అంశం అయితే ఇప్పుడు ఈ వేడుకకి ఆయనకి ఎంతో దగ్గరైన ఈ ఇద్దరు అగ్ర తారలు హాజరు కానుండటం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వేడుకలు రేపు ఆక్టోబర్ 10 న ఫిల్మ్ నగర్ లో జరగబోతున్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రీ లీలా హీరోయిన్ గా నటించగా కీరవాణి అప్పటి సినిమాలానే దీనికి కూడా అద్భుతమైన సంగీతం అందించారు. మరి ఈ సినిమా వచ్చే ఆక్టోబర్ 15 న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం :