గోపీచంద్, సన్నీ డియోల్ సినిమాకి ఈ పనులు స్టార్ట్

గోపీచంద్, సన్నీ డియోల్ సినిమాకి ఈ పనులు స్టార్ట్

Published on Jul 11, 2024 11:54 AM IST


బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఊర మాస్ కాంబినేషన్ పట్ల హిందీతో పాటుగా తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొనగా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.

ఇక ఇదిలా ఉండగా దీనితో పాటుగా తాజాగా దర్శకుడు మరో అప్డేట్ ని అయితే అందించాడు. ఈ సినిమాకి తాము మ్యూజిక్ పనులు కూడా ఆరంభించినట్టుగా అప్డేట్ అందించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ వర్క్ చేస్తుండగా తాను థమన్ కలిసి తిరుమలేశుని దర్శనం అనంతరం తమ చిత్రానికి స్వామి ఆశీస్సులతో మ్యూజిక్ పనులు స్టార్ట్ చేసినట్టుగా తెలిపారు.

మరి గోపీచంద్ సినిమాలకి థమన్ ఇచ్చిన ఆల్బమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కానీ నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఇప్పుడు ఇది బాలీవుడ్ సినిమా కావడంతో వీరి కాంబినేషన్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు