నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్లే – ‘సీతారామం’ హీరోయిన్

నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్లే – ‘సీతారామం’ హీరోయిన్

Published on Mar 31, 2023 7:59 PM IST


ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ లవ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సీతారామం. రష్మిక మందన్న కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా దీనిని వైజయంతి మూవీస్ సంస్థ ఎంతో భారీగా నిర్మించింది. తెలుగుతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లో సీతారామం పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా హీరోయిన్ గా ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్న మృణాల్ ప్రస్తుతం మంచి అవకాశాలతో కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా ఒక కార్యక్రమంలో భాగంగా ఆమె తన లైఫ్, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నిజానికి తాను సీరియల్ నటి నుండి నేడు హీరోయిన్ గా ఇంతటి స్థాయికి వచ్చాను అంటే అందుకు కారణం తన తల్లితండ్రులు అని ఆమె అన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తానని అన్నారు. మొదట తాను మూవీ ఇండస్ట్రీ లోకి వస్తాను అంటే అందరు తల్లితండ్రుల మాదిరిగా వారు కూడా ఒకింత భయపడ్డారని, ఆ తరువాత తాను సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చి ముందుకు సాగుతుండడంతో మెల్లగా వారి నుండి సపోర్ట్ లభించిందని అన్నారు. నేను పోషించే పాత్రల పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఆ విషయంలో తాను గర్వపడుతున్నట్లు చెప్పారు మృణాల్ ఠాకూర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు