ఆ ఇద్దరు ఒక్కటి అయ్యారు !

హీరోయిన్ భావన పెళ్లి తన ప్రియుడు నవీన్‌తో జరగబోతునట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కన్నడలో భావన చేసిన ఓ సినిమాకు నవీన్ నిర్మాతగా వ్యవహరించాడు. అప్పుడే భావన, నవీన్ లు ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు ఇష్టపడి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఈరోజు ఉదయం కేరళలోని త్రిసూర్ లో వీరిద్దరు ఒక్కటి అయ్యారు. కొద్దిమంది సన్నిహితులు బందు మిత్రులు ఈ వివాహానికి హాజరు అవ్వడం విశేషం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన భావన ప్రస్తుతం మలయాలంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. తెలుగులో ఈ హీరోయిన్ చేసిన మహాత్మా, ఒంటరి సినిమాలు చేసింది.