ఆ ఇద్దరు దర్శకులు నా ఆల్ టైం ఫేవరెట్ – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

ఆ ఇద్దరు దర్శకులు నా ఆల్ టైం ఫేవరెట్ – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Published on Dec 30, 2022 2:59 AM IST

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో కొనసాగుతున్న క్రేజీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2. అయితే విషయం ఏమిటంటే, ఈ షోకి ఈ వారం తన స్నేహితుడు యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా వచ్చారు ప్రభాస్. ఇక వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు ఆహా వారు.

వాటిలో మొదటి భాగాన్ని నిన్న రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగిన ఈ భాగం అందరినీ ఎంతో ఆకట్టుకుంటూ దూసుకెళుతోంది. అందులో భాగంగా తనకు ఇష్టమైన ఆల్ టైం ఫేవరెట్ దర్శకులు ఇద్దరు ఉన్నారని వారు దివంగత దర్శకుడు బాపు, అలానే మణిరత్నం అని చెప్పారు ప్రభాస్. వారిద్దరి సినిమాలు తాను ఏ మాత్రం మిస్ కాకుండా చూస్తానని, తప్పకుండా భవిష్యత్తులో అవకాశం వస్తే మణిరత్నం గారితో వర్క్ చేయడానికి తాను సిద్ధం అని తెలిపారు ప్రభాస్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు