దేవదాసుని ఆథరైజ్డ్ డ్రింకర్ చేశేశారుగా…!.

90ml1

హీరో కార్తికేయ కొత్త చిత్రం 90ఎంఎల్. రేపు ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. టైటిల్ నే మందు పెగ్గు కొలతలతో కొత్తగా ఫిక్స్ చేసిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి పోస్టర్ లో మందు బాటిల్ ఉండడం గమనార్హం. ఈ చిత్ర ట్యాగ్ కూడా యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్ అని ఉండటం ఆసక్తిరేపుతుంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తుండగా, రేపు ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఐతే ఆ అనౌన్స్మెంట్ పోస్టర్ పై వినూత్నంగా దేవదాస్ గెటప్ లో ఉన్న నాగేశ్వరరావు ఫోటో ఉండటంతో పాటు కింద మన ఒకేఒక్క ఆథరైజ్డ్ డ్రింకర్ దేవదాస్ ని వేశారు.

నేడు ఏఎన్ఆర్ జయంతి కావడంతో ఈ పోస్టర్ విశేషత సంతరించుకుంది. దేవదాసు చిత్రంలో నాగేశ్వరరావు తాగుబోతుగా మారిన భగ్న ప్రేమికుడిగా చేసిన సంగతి తెలిసిందే. మరి 90ఎం ఎల్ చిత్రంలో కూడా కార్తికేయ పాత్ర దేవదాసు ఛాయలు కలిగి ఉంటుందా అనే అనుమానము కలుగుతుంది. రేపు టీజర్ విడుదలయ్యే వరకు ఈ 90ఎం ఎల్ కథేంటో..? ఆ ఆథరైజ్డ్ డ్రింకర్ మేటర్ ఏంటో? తెలుస్తుంది.

Exit mobile version