థాంక్యూ కలెక్టర్ అంటూ మూడవ ఫైల్ ను రిలీజ్ చేసిన దేవకట్టా!

Published on Sep 21, 2021 12:07 am IST


సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం ను అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం సమాజం పై ఉండే పలు అంశాల పై తీసుకొని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర దర్శకుడు దేవకట్టా థాంక్యూ కలెక్టర్ అంటూ పలు వీడియో లను విడుదల చేస్తున్నారు.

మొదటి వీడియో డీకే రవి పై చేయగా, రెండవ వీడియో యూ సగాయం పై చేశారు. తాజాగా మూడవ విడియో ను విడుదల చేశారు. రజనీ సేఖ్రి సిబల్ పై మూడవ వీడియో ను విడుదల చేసారు. కలెక్టర్ గా తను పని చేసిన విధానం, హర్యానా రాష్ట్రం లో రాజకీయ నాయకుల ను కోర్ట్ కు ఎక్కించి, జైలు శిక్ష అనుభవించే విధంగా తను వ్యవహరించిన తీరు పట్ల వుడియో చేయడం జరిగింది. ఈ మేరకు రిపబ్లిక్ సినిమా లో సాయి ధరమ్ తేజ్ పాత్ర సైతం ఈ తరహా లో చాలా పవర్ ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. ఈ తరహా వీడియో లను విడుదల చేస్తుండటం తో సినిమా ఏ విధంగా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :