బన్నీ కెరీర్లో క్లాసిక్ హిట్ కి మూడో సినిమా కూడా అట.!

Published on Oct 10, 2021 7:12 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా అప్ గ్రేడ్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరి కెరీర్ లో హ్యాట్రిక్ సినిమా ఇది పైగా రెండు భాగాలుగా వస్తుంది. అంటే మొత్తం నాలుగు సినిమాలు వీరి నుంచి రానున్నట్లు అర్థం.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో నుంచి వచ్చిన లాస్ట్ రెండు సినిమాలు ఆర్య, ఆర్య 2 కూడా టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ స్థానం సంపాదించుకున్నాయి.

ఆర్య 2 ఆ టైం బాక్స్ ఆఫీసు పరంగా అనుకున్న స్థాయి విజయం అందుకోకపోయినా తర్వాత మాత్రం క్లాసిక్ జాబితాలోకి చేరిపోయింది. అందుకే మళ్లీ దీనికి సీక్వెల్ వచ్చినా ఇప్పటికీ అదే క్రేజ్ ఉంటుంది. మరి దీనిపై సుక్కు ఒక క్లారటీ ఇచ్చేసారు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుందట. ఆల్రెడీ అందుకు వర్క్ రెడీ అవుతోంది అని తాజాగా సుకుమార్ చెప్పడం వైరల్ గా మారింది. దీనితో బన్నీ సహా మూవీ లవర్స్ లో ఈ మూడో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది..

సంబంధిత సమాచారం :