“సర్కారు వారి పాట”లో మరో బిగ్ హైలైట్ గా ఈ సీక్వెన్స్.!

Published on Jan 18, 2022 9:01 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మరియు మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం కోసం అభిమానులు అయితే చాలా క్రేజీ గా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాలో పెట్ల స్ట్రాంగ్ కంటెంట్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు.

మరి ఆల్రెడీ ఈ సినిమాలో దుబాయ్ యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ లెవెల్లో అవుట్ పుట్ తో వచ్చిందని టాక్ ఉంది. దీనితో ఆ సీన్ పై భారీ అంచనాలు నెలకొనగా ఇపుడు ఇంకో అదిరే సీక్వెన్స్ కోసం తెలుస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలు దీనికి సంబంధించి వైరల్ అవుతున్నాయి. బీచ్ దగ్గర విలన్స్ తో పోరాట సన్నివేశం లా కనిపిస్తున్నాయ్ కానీ ఇది వేరే లెవెల్ మాస్ ఫైట్ లానే కనిపిస్తుంది.

దీనితో ఈ సీక్వెన్స్ కూడా సినిమాలో ఇంకో బిగ్ హైలైట్ కావడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :