మరో ఓటిటి ప్లాట్ ఫారం లో ప్రసారం కానున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్!

Published on Feb 9, 2023 11:00 am IST

టాలీవుడ్ యంగ్ హీరో, నైట్రో స్టార్ సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ హంట్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శ్రీకాంత్, భరత్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి మహేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది అనే విషయం తెలిసిందే.

ఈ సినిమా అదే తేదీ నుంచి ఆహా వీడియో లో కూడా ప్రసారం కానుందని తాజా సమాచారం. ఇదే విషయాన్ని తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన ఆహా వీడియో ధృవీకరించింది. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :