దేవర: ఆ నటుడి డబ్బింగ్ పార్ట్ పూర్తి!

దేవర: ఆ నటుడి డబ్బింగ్ పార్ట్ పూర్తి!

Published on Jul 11, 2024 7:31 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రంలో నటిస్తున్న గెటప్ శ్రీను తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఒక ఫోటో ద్వారా సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు