ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఓ సాంగ్ షూట్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వినిపించినా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తాజాగా, ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండనుందని.. దాని కోసం స్టార్ బ్యూటీని తీసుకునేందుకే ఇంకా ఆ పాట షూటింగ్ జరుపుకోలేదని తెలుస్తోంది. అయితే, ఈ పాట కోసం చాలా మంది పేర్లను అనుకున్నా, ‘దేవర’తో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకున్న జాన్వీ కపూర్‌ని తీసుకుంటారనే టాక్ విపరీతంగా వైరల్ అయ్యింది. కానీ, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని ఈ ఐటెం సాంగ్ కోసం తీసుకున్నారని.. ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.
ఈ సాంగ్ కోసం శ్రద్ధా ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పాటను అతిత్వరలో షూట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ‘పుష్ప-2’ చిత్రంలో జాన్వీని కాదని ఐటెం సాంగ్ కోసం శ్రద్ధా కపూర్‌ని తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.