సందీప్ కిష‌న్ సినిమాలో ఆ బ్యూటీ న‌టిస్తోందా..?

సందీప్ కిష‌న్ సినిమాలో ఆ బ్యూటీ న‌టిస్తోందా..?

Published on Jun 20, 2024 8:01 PM IST

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో 30వ చిత్రం రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ద‌ర్శ‌కుడు న‌క్కిన త్రినాథ‌రావు డైరెక్ష‌న్ లో ఈ సినిమాను ప్రారంభించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తున్నారా అనే అంశం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా, ఈ సినిమాలో ఓ కొత్త‌మ్మాయిని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ తొలుత భావించింద‌ట‌. కానీ, ఇప్పుడు ఈ సినిమాలో రీతూ వ‌ర్మ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన‌ట్లు సినీ సర్కిల్స్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రీతూ వ‌ర్మ అయితే బాగుంటుంద‌ని మేక‌ర్స భావించార‌ట‌.

సందీప్ తో పాటు రావు ర‌మేష్ పాత్ర ఈ సినిమాలో చాలా కీల‌కంగా ఉండ‌నుంద‌ట‌. అయితే, ఆయ‌న పాత్రకు జోడీగా ‘మన్మ‌ధుడు’ ఫేం అన్షు న‌టిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ క్లారిటీ ఇస్తే బాగుంటుంద‌ని అభిమానులు కోరుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు