విజ‌య్ లాస్ట్ మూవీలో ఆ స్టార్ హీరోయిన్ కే ఛాన్స్..?

విజ‌య్ లాస్ట్ మూవీలో ఆ స్టార్ హీరోయిన్ కే ఛాన్స్..?

Published on Jul 3, 2024 7:37 PM IST

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు వెంకట్ ప్ర‌భు డైరెక్ట్ చేస్తుండ‌టంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా త‌రువాత విజ‌య్ త‌న చివ‌రి సినిమాలో న‌టిస్తాడు. ద‌ర్శ‌కుడు హెచ్.వినోద్ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ కెరీర్ లో 69వ సినిమాగా రానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తార‌నే అంశంపై కోలీవుడ్ లో ప‌లు ఇంట్రెస్టింగ్ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే, ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ స‌మంత‌ను తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

గ‌తంలో విజ‌య్, స‌మంత హిట్ పెయిర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌రోసారి ఆమెను తీసుకుంటే, ఈ సినిమా కూడా హిట్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక‌పై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు