విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ సినిమాలో నటించాలని ఉందన్న ఈ హాట్ బ్యూటీ!

Published on May 19, 2022 12:25 am IST

టాలీవుడ్ హ్యాండ్సం హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్, జన గణ మన మరియు శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ లో బిజీ హీరోగా ఉన్న విజయ్ తో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ లు నటించేందుకు ఆసక్తి చూపిస్తుండగా, తాజాగా ఆ లిస్ట్ లోకి ఇప్పుడు మరో ముద్ద గుమ్మ చేరింది, తనే మాళవిక మోహనన్. ఆస్క్ మాళవిక హ్యాష్ ట్యాగ్ తో అభిమానులతో మాట్లాడుతున్న ఆమె తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు తలపతి విజయ్ లతో నటించిన మీరు, ఎవరితో యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు అని ఒక అభిమాని అడగగా, అందుకు విజయ్ దేవరకొండ అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ మూవీ లేదా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించాలని ఉంది అంటూ తెలిపారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిన ఈ హీరో లిస్ట్ లో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :