నాని “దసరా” కి అక్కడ అద్దిరిపోయే డిమాండ్!

Published on Feb 15, 2023 3:05 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తోనే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారగా, విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. రిలీజైన టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ను మార్చి 30 వ తేదీన భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

అయితే ఈ చిత్రం కి సీడెడ్ ఏరియా లో భారీగా డిమాండ్ ఉన్నట్లు ప్రి రిలీజ్ బిజినెస్ ను చూస్తే తెలుస్తుంది. ఆ ఒక్క ఏరియా లోనే 6 కోట్ల రూపాయలకి పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే మిగతా ఏరియా ల్లో కూడా అదే రేంజ్ లో ఉండేలా తెలుస్తోంది. నాని దసరా మూవీ పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :