“ఆదిపురుష్” లో ఈ అంశం కూడా మంచి హైలైట్ గా.!

Published on Jun 30, 2022 2:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తాను డైరెక్ట్ హిందీలో చేసిన ఫస్ట్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉంది. అయితే ఈరోజే ఈ చిత్రంపై ఒక క్రేజీ అప్డేట్ కూడా బయటకి వచ్చి వైరల్ అయ్యింది. అలాగే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి అయితే ఆసక్తిగా మారింది.

ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ప్రభాస్ రామునిగా బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్ సీతా దేవి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా సీతా రాములుగా ప్రభాస్ మరియు కృతి ల కెమిస్ట్రీ కూడా చాలా హైలైట్ గా వచ్చిందట. ఇది ఇప్పుడు బాలీవుడ్ వర్గాల నుంచి బయటకి వచ్చిన టాక్. మరి ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :