“హిట్ 2” లో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి.!

“హిట్ 2” లో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి.!

Published on Nov 30, 2022 11:00 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ చిత్రం “హిట్ 2”. అడివి శేష్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా పై ఇప్పుడు ఓ అంశంపై అయితే మరింత ఆసక్తి పెరుగుతూ వస్తుంది. దర్శకుడు శైలేష్ కొలను తీసిన గత చిత్రం హిట్ లో హీరో ఫ్లాష్ బ్యాక్ లో విలన్ ఎవరు అనేది సస్పెన్స్ గా ఉంచారు.

ఇక ఈసారి సినిమాలో కూడా విలన్ ని ఈ రకంగానే ప్రెజెంట్ చేస్తూ ఉండడం ఆసక్తి నెలకొల్పగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విలన్ ఎవరు అనే అంశమే మంచి చర్చగా నడుస్తుంది. దీనికి ఎవరి థియరీ లు వారు చెప్తుండగా వాటికి శేష్ కూడా రిప్లై లు ఇస్తున్నాడు. మరి ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా వాల్ పోస్టర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు