“డబుల్ ఇస్మార్ట్”.. ఈ విషయంలో ఎందుకో సస్పెన్స్

“డబుల్ ఇస్మార్ట్”.. ఈ విషయంలో ఎందుకో సస్పెన్స్

Published on May 12, 2024 5:00 PM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం విషయంలో మేకర్స్ ఆల్రెడీ సాలిడ్ అప్డేట్ లు అందిస్తుండగా ఓ అంశం మాత్రం మంచి సస్పెన్స్ గా మారింది.

గత చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), నభా నటేష్ (Nabha Natesh) లు ఉన్న సంగతి తెలిసిందే. వాళ్ళ గ్లామ్ షో కూడా మంచి ప్లస్ అయ్యింది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు పార్ట్ 2 లో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. గత కొంత కాలం కితం కావ్య థాపర్ కనిపిస్తుంది అని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వస్తున్నా ఏ అప్డేట్ లో కూడా తన పేరే అని కాకుండా ఏ హీరోయిన్ ని కూడా మేకర్స్ మెన్షన్ చేయడం లేదు. దీనితో ఇంకా హీరోయిన్ అంశం మాత్రం సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు