“ఎన్టీఆర్ 30” కి ఇంకా పరిశీలనలోనే ఈ అంశం.?

Published on Oct 7, 2022 1:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉండే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి తన మాస్ ఛరిష్మాకి తగ్గట్టు ఓ భారీ మాస్ ప్రాజెక్ట్ పడితే దాని బాక్సాఫీస్ బ్లాస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. మరి ఇది అయితే కొరటాల శివతో తన కెరీర్ లో చేసే 30వ సినిమాతో ఉండబోతుంది అని ఆల్రెడీ క్లియర్ అయ్యిపోయింది. అయితే ఇంకా ఈ సినిమా స్టార్ట్ కావడం అనే అంశం ఇంకా హోల్డ్ లోనే ఉంది.

ఇక దీనితో పాటుగా సినిమాకి ఎంతో కాలంగా మంచి సస్పెన్స్ గా ఉన్న మరో అంశం హీరోయిన్ ఎవరు అనేది. అయితే ఇప్పటికే చాలా మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి కానీ ప్రస్తుతానికి అయితే ఇంకా ఎవరూ ఫైనలైజ్ కాలేదనే కొత్త టాక్ వినిపిస్తుంది. మరి ఇదెప్పుడు క్లియర్ అవుతుందో అనేది చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ అయితే సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ సినిమా వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :