వేరే లెవెల్ మాస్ లో “సర్కారు వారి పాట”.!

Published on Nov 16, 2021 4:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఎనలేని అంచనాలు మహేష్ అభిమానులు పెట్టుకున్నారు. ఓ రకంగా చెప్పాలి అంటే ఈ సినిమా నుంచే మహేష్ 2.0 వెర్షన్ కూడా స్టార్ట్ అయ్యినట్టు అని చెప్పాలి. కంప్లీట్ గా సరికొత్త మహేష్ ని ప్రెజెంట్ చేస్తూ దీని తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్ లోకి తాను అడుగు పెట్టబోతున్నాడు.

అందుకే ఈ పర్టిక్యులర్ సినిమాపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రతీ అంశాన్ని చాలా కేర్ గా డీల్ చేస్తున్న పెట్ల డైలాగ్స్ పరంగా కూడా చాలా సాలిడ్ ప్లాన్స్ వేసాడని ఇది వరకే విన్నాము. అయితే ఇవి మహేష్ నుంచి మాత్రం ఊహించిన దానికంటే వేరే లెవెల్లో ఉండబోతున్నాయట. అంటే స్టైలిష్ లుక్స్ మహేష్ నుంచి పక్కా మాస్ డైలాగ్స్ చూడబోతున్నాం అనమాట.

సంబంధిత సమాచారం :

More