టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుల్కర్ తనదైన మార్క్ విజయాన్ని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో దుల్కర్ సరసన హీరోయిన్‌గా అందాల భామ మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతా రామం’ క్లాసిక్ సక్సెస్‌ను అందుకుంది.
దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయితే, మరో క్లాసిక్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. మరి నిజంగానే ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.