ఈ బడా బ్యానర్ కి అజిత్ “తునివు” ఓవర్సీస్ హక్కులు.!

ఈ బడా బ్యానర్ కి అజిత్ “తునివు” ఓవర్సీస్ హక్కులు.!

Published on Nov 19, 2022 1:00 PM IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైనటువంటి అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “తునివు”. తన లాస్ట్ సూపర్ హిట్ చిత్రం “వలిమై” దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఇపుడు ఈ సినిమా సాంగ్ షూట్ మరియు ప్రీ రిలీజ్ బిజినెస్ పనులు స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రం ఓవర్సీస్ రిలీజ్ డీల్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యింది.

మరి ఈ చిత్రం ఓవర్సీస్ డీల్ ని అయితే బడా చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రాన్ని తమ నుంచి రిలీజ్ చెయ్యడం ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. అలాగే అజిత్ సినిమాలతో కొలాబరేట్ అవ్వడం కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అని వారు వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రానికి అయితే జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు