చిరు, చరణ్ లతో భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న బడా బ్యానర్.?

Published on Sep 16, 2021 6:30 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి మరియు తన వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రస్తుతం తన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే వీరిద్దరూ కలిపి ఆచార్య అనే సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం కూడా తెరకెక్కుతుంది. అయితే వారి లైనప్ లో మరికొన్ని సినిమాలు చేసాక ఓ బడా బ్యానర్ లో ఇద్దరూ కూడా వర్క్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ వినిపిస్తుంది.

అదే సాహో, ఇప్పుడు రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలను ఇండియన్ సినిమాకి సమర్పిస్తున్న బ్యానర్ యూవీ క్రియేషన్స్. మరి ఈ బడా బ్యానర్ లో చిరు మరియు చరణ్ లు ఇద్దరు కూడా వేరే వేరే దర్శకులతో సినిమాలు చేయనున్నారని నయా బజ్. ప్రస్తుతానికి అయితే కొందరు దర్శకుల పేర్లు వినపడుతున్నాయి కానీ ఈ కాంబోలో సినిమా సెట్టయింది లేదు అన్నది కాలమే నిర్ణయించాలి మరి.

సంబంధిత సమాచారం :