“RRR” ప్రీ రిలీజ్ కి ఈ బిగ్ గెస్ట్ కన్ఫర్మ్..?

“RRR” ప్రీ రిలీజ్ కి ఈ బిగ్ గెస్ట్ కన్ఫర్మ్..?

Published on Dec 16, 2021 7:36 PM IST


పాన్ ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన భారీ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం” ముందు వరుసలో ఉంటుంది.

ఇటీవల వచ్చిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లాయి. దీనితో ఈ బిగ్ మూవీ పై ప్రతీ అప్డేట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే గత కొన్నాళ్ల కితం వినిపించిన బజ్ నిజమే అన్నట్టు వినిపిస్తుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ కి గాను బాలీవుడ్ బిగ్ స్టార్ అయినటువంటి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రావడం కన్ఫర్మ్ ఆల్ మోస్ట్ అని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఈవెంట్ ని అయితే ముంబై లో భారీ లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు