మెగాస్టార్, సూర్య సినిమాలతో పోటీగా మరో బిగ్ మూవీ.!

Published on Dec 3, 2021 8:05 pm IST


వచ్చే ఏడాదికి ఆల్రెడీ ఇప్పుడు నుంచే అనేక సినిమాలు తమ కొత్త రిలీజ్ డేట్స్ ని ఫైనల్ చేసుకుంటున్నాయి. మరి జనవరి నెల మొదలు కొని భారీ చిత్రాలు ఫిబ్రవరి నెలకి కూడా ఉన్నాయి. అయితే ఆ నెలలో మాత్రం స్టార్టింగ్ వారమే భారీ చిత్రాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

మరి ఈ ఫిబ్రవరి 4న మెగాస్టార్ మరియు చరణ్ ల బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” ముందే డేట్ ఫిక్స్ చేసుకోగా తర్వాత ఇదే డేట్ కి సూర్య నటించిన మాస్ యాక్షన్ డ్రామా “ఎతరక్కుమ్ తునిందవన్” కూడా తర్వాత డేట్ ని అనౌన్స్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ రెండు బిగ్ సినిమాల డేట్ కి బాలీవుడ్ చిత్రం స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో భారతీయ మహిళా క్రికెట్ సెన్సేషన్ మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం “శభాష్ మిథాలీ” కూడా డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

దీని తాలూకా డేట్ కూడా ఈరోజు అనౌన్స్ అయ్యింది. అయితే పాండిరాజ్ దర్శకత్వం వహించిన సూర్య సినిమా అలాగే శ్రీజిత్ ముఖర్జీ దర్సకత్వం వహించిన తాప్సి సినిమాల తెలుగు రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :